22 June, 2026 | 1:47 AM

అగ్రకులాల పాలనను పాతరేస్తాం..

22-06-2026 12:38 AM
  1. తెలంగాణలో దొరల, పటేళ్ల పాలనను అంతమొందిస్తాం
  2. మలిదశ తెలంగాణ ఉద్యమ మాదిరిగా బీసీ ఉద్యమం నిర్మిస్తాం
  3. జూలై 2 నుండి నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తాం
  4. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, జూన్ 21 (విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం అయినవ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జాక్ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్‌తో కలిసి ఆయన  మాట్లాడుతూ తెలంగాణను మో సం చేస్తున్న సందర్భంగా అసలు తెలంగాణ వాదమే కనుమరుగయిందన్నారు.

తెలంగాణ భావజాలాన్ని, ఉద్యమాన్ని, సిద్ధాంతా న్ని సజీవంగా ఉంచినటువంటి గొప్ప మానవతవాది ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఆయన పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఒక బీసీ బిడ్డగా జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం బీసీ బిడ్డలే ముందు వరుసలో ఉన్నారన్నా రు. బీసీలే తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్ర ధాన కారణమన్నారు. బీసీల త్యాగాల తోటే తెలంగాణ రాష్ట్రం సహకారం అయిందన్నా రు.

జూలై 2 నుండి 31 వరకు దొరల పటేళ్లకు తెలంగాణ హఠావో.. బీసీ సీఎంకు బనా వో పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీలను చైతన్యం చేస్తామని ఆయన వెల్లడిం చారు. ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో బీసీ బిడ్డే సీఎం కావాలని బీసీల నినాదం, బీసీల వాదం లక్ష్యంగా, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ జేఏసీ నాయకులు భాస్కర్ మేరు, రాజేందర్, సంధ్యారాణి, వరుణ్ కుమార్, మహేష్, సత్య గౌడ్, కిరణ్, నరేష్, రేణుక, రాజు గౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.