6 August, 2026 | 2:30 AM

గోల్డెన్ అవర్‌ను సద్వినియోగం చేసుకోవాలి

06-08-2026 12:24 AM

అలంపూర్/గట్టు, ఆగస్టు 5 (విజయ క్రాంతి) : సైబర్ నేరాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్ అవర్’ను సద్వినియోగం చేసుకుని గంటలోపు 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని, లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఎస్ ఐ రామకృష్ణ సూచించారు.

ఈ మేరకు బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల పట్లవిద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, అనుమానాస్పద లింకులు, ఏపీకే  ఫైళ్లు, క్యూ ఆర్ కోడ్ మోసాలు, సోషల్ మీడియా భద్రత, డిజిటల్ చెల్లింపుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిజిటల్ అరెస్ట్, యూపీఐ, లోన్, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై పోలీసులు సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి అధ్యాపక బృందం పాల్గొన్నారు

గట్టు గురుకుల పాఠశాలలో

గట్టు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో సురక్ష కార్ ట్రైనింగ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు సైబర్ నేరాల పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గట్టు ఎస్త్స్ర శేఖర్ గౌడ్ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.