6 August, 2026 | 2:31 AM

ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యానికి రూ.25 వేల ఆర్థిక సాయం

06-08-2026 12:24 AM

గట్టు, ఆగస్టు 5 (విజయక్రాంతి): గట్టు మండలం చాగదోన గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి వినోద్ కుమార్కు ప్రభుత్వ ఉద్యోగ లక్ష్య సాధనలో తోడ్పాటుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ రూ.25 వేల ఆర్థిక సాయం అందించింది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన వినోద్ కుమార్ కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేయగా, ప్రస్తుతం ఎస్‌ఎస్సీ కోచింగ్కు సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలో గద్వాలలోని శృతివనం పార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్ సభ్యులు రూ.25 వేల చెక్కును అందజేసి, పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగమద్దిలేటి, మోహన్, బెంజమిన్, సంజీవ్, నగేష్, రామన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.