11 April, 2026 | 3:12 AM

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి

03-01-2026 12:06 AM

అర్మూర్, జనవరి 2 (విజయ క్రాంతి) : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని అర్మూర్ పట్టణ బిజెపి అధ్యక్షుడు మందుల బాలు కోరాడు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల ఓటర్ లిస్ట్ లోని తప్పులను మరియు బోకస్ ఓట్ల ప్రక్షాళన చేసి పై అధికారులకు ఫిర్యాదు చేయడం పై చర్చించడం జరిగింది.

బోగస్ ఓట్లు మరియు స్థానికంగా లేనివారి ఓట్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించే విధంగా కార్యచరణ మొదలు పెట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు, కార్యదర్శి పోల్కం వేణు, సీనియర్ నాయకులు యామాద్రి భాస్కర్, మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల శీను, ధ్యాగా ఉదయ్, కలిగుట గంగాధర్, ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, కందీశ్ ప్రశాంత్, జాగిర్ధర్ శీను, సుంకరి రంగన్న, ఆకుల రాజు, దొండి ప్రకాష్, ఉపాధ్యక్షుడు బాండ్లపల్లి నర్సిరెడ్డి, బ్యావత్ సాయి కుమార్, విజయ్ ఆనంద్, కుక్కునూరు లింగన్న, పిట్ల శ్రీధర్, బీజేవైఎం అధ్యక్షుడు ఉదయ గౌడ్, దళిత మూర్చ అధ్యక్షుడు శేఖర్, పులి యుగేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.