calender_icon.png 1 July, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలి

01-07-2025 01:15:15 AM

జుక్కల్ నియోజకవర్గంలో ఎప్పుడు జరగని అభివృద్ధి పనులు 

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు 

జుక్కల్, జూన్ 30 (విజయ క్రాంతి), ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో పలు బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆరు కోట్ల 82 లక్ష రూపాయల విలువ గల పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కనీసం గ్రామాల్లో రోడ్లు వేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు గ్రామాలలో పర్యటించినప్పుడే స్థానం ఎమ్మెల్యేగా గెలిచాక ముందుగా రోడ్లు  వేయించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో సిసి రోడ్ల నిర్మాణం కోసం 33 కోట్లు నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేయించడానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు.

గతంలోని అసమర్ధ నాయకుల వల్ల ఆగిపోయిన లెండి, నత్త నడకన సాగుతున్న నాగమడుగు ప్రాజెక్టుల పనులు నేడు వేగవంతంగా జరుగుతున్నాయని నియోజకవర్గంలో ఇప్పటికే ఇందిరా మహిళ నిర్మాణాలు ధర్మమయ్యాయని ఇక ముందు కూడా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రేషన్ దుకానాల్లో పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.