calender_icon.png 1 July, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు జవాబుదారుగా పనిచేయాలి

01-07-2025 01:17:28 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 

కామారెడ్డి, జూన్ 30 (విజయ క్రాంతి): అధికారులు జవాబీదారుగా విధులు నిర్వహించాలని  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో  ప్రజల నుంచి కలెక్టర్ , అదనపు కలెక్టర్ విక్టర్ ,లోకల్ బాడీ కలెక్టర్ చందర్  డిఆర్డిఓ పి.సురేందర్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.  పెండింగ్ దరఖాస్తులపై శ్రద్ధ పెట్టాలని , ప్రజావాణిలో మొత్తం 141 దరఖాస్తు వచ్చాయని,  వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు.  సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన  దరఖాస్తులను కూలం కషంగా పరిశీలించి,  పెండింగ్ ఉంచకుండా, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.