17 April, 2026 | 1:19 AM

గెలిచితీరాలి!

01-02-2026 01:58 AM

90 శాతానికి పైగా హస్తగతం చేసుకోవాలి 

  1. గెలిచేవారికే బీ ఫామ్ ఇవ్వాలి 
  2. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు దీటుగా అభ్యర్థుల ఎంపిక ఉండాలి 
  3. ప్రతి డివిజన్, ప్రతి వార్డు ముఖ్యమే 
  4. రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి 
  5. మున్సిపోల్స్‌పై పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం 

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి):  మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల ను కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి సూచించారు. ప్రతి డివిజన్, ప్రతి వార్డు ముఖ్యమేనని, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనం దరిపై ఉందన్నారు. పురపోరులో  90 శాతానికి పైగా హస్తగతం చేసుకోని పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శనివారం జూమ్ సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో అమెరికా నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, డి ప్యూటీ  సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు, నేతలకు సీ ఎం దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యంగా ఉండొద్దని, బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఉండాలన్నారు.

రెబల్స్ విషయంలో అందరితో మాట్లాడి సమన్వ యం చేసుకోవాలని, పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై  దృష్టి పెట్టాలన్నారు. రెబల్స్‌ను బుజ్జగించే బాధ్యతను ఇన్‌చార్జ్ మంత్రులు తీసుకోవాలన్నారు. నియోజకవర్గాల్లోని నాయకుల మధ్య ఏమైనా అంతర్గత సమస్యలుంటే చర్చించి పరిష్కరించాలని, వారి మధ్య అం తరం లేకుండా చూడాలని పార్టీ శ్రేణులకు సీఎం సూచనలు చేశారు. బీ ఫారాలు ఇన్‌చార్జ్ మంత్రులతో డీసీసీలకు అప్పగిం చాలని సీఎం పేర్కొన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరు సమిష్టిగా పని చేస్తే గెలుపు సాధ్యమని, అందుకు ఉదహరణ  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలని తెలిపారు.