నూతన వార్డు సభ్యులకు శిక్షణ ప్రారంభం
05-03-2026 12:09 AM
చివ్వెంల, మార్చి 4 : చివ్వెంల మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం, 2018 పై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తొలి విడతగా 10 గ్రామాల వార్డు సభ్యులు హాజరయ్యారు.
ఎం.పి.డి.ఓ సంతోష్ కుమార్ అధ్యక్షత వహించగా, చట్టంపై పూర్తి అవగాహనతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. శిక్షకులు మార్గదర్శకత్వం అందించగా, పంచాయితీ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




