17-05-2025 12:34:15 AM
హైదరాబాద్, మే 16 (విజయ క్రాంతి): రాష్ట్రంలో 60.14 లక్షల ఎక రాల్లో వరి సాగు అయిందని, 129.35 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుం దనే అంచనా వేస్తున్నట్టు పౌరసరఫాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలి పారు. ప్రభుత్వం 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం గా పెట్టుకుందని, ఇప్పటికే 50 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు వివరిం చారు.
ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై గురువారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, పౌరసరఫాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహన్, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ధాన్యం దిగుబడి రికార్డుస్థాయిలో పెరగడంతో ముందెన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలను కూడా పెంచినట్టు చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం అత్యం త ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని, తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని పేర్కొన్నారు. 2023 యాసం గి సీజన్‌లో మే 15 నాటికి 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ సారి అదే మే 15 నాటికి 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టు వివరించారు. ధాన్యం కొను గోలుకు 8,348 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
2021-22తో పోల్చితే ఈ సిజన్‌లో అధికంగా 1,739 కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతు ల అభీష్టానికి అనుగుణంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలని సూచించారు.
వారం పది రోజులు కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో లోపాలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలని చెప్పా రు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై జరుగుతున్న దుష్పచారాన్ని తిప్పికొట్టాలని, నిజానిజాలు ప్రజలకు చెప్పి, రైతులకు భరోసా కల్పించడంలో కలెక్టర్లు చొరవ తీసుకోవా లని సూచించారు.