17-05-2025 12:33:01 AM
లీగల్ సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్
కరీంనగర్, మే 16 (విజయక్రాంతి): కరీంనగర్ కు న్యాయ కళాశాలను మంజూరు చేయడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఎనలేనిదని స్టేట్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పొన్నం ప్రభాకర్ న్యాయ కళాశాలను మంజూరు చేయిస్తే బిజెపి నాయకులు తమ ఖాతాలో వేసుకోవడం విడ్డూర మన్నారు.
న్యాయ కళాశాల మంజూరు విషయమై బార్ కౌన్సిల్ ఆమోదం పొందడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రమేయం ఏమీ లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేం దుకు బిజెపి నాయకులు శాతవాహన యూనివర్సిటీ ఎదుట కార్యక్రమాలు చేయడం సిగ్గుచేట న్నారు. బండి సంజయ్ కి దమ్ముంటే కేంద్ర మంత్రి హోదాలో కరీంనగర్ కు లా యూనివర్సిటీని తీసుకురావాలన్నారు.
ఎంపీగా, కేంద్రమంత్రిగా బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. విషయపరిజ్ఞానం లేని బండి సంజయ్ ని గెలిపించి తప్పు చేశామని కరీంనగర్ ప్రజలు బాధపడుతున్నారన్నారు. న్యాయ కళాశాల మంజూరు విషయంలో కృషిచేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా చైర్మన్ కల్లేపల్లి, వైస్ చైర్మన్ వడ్లూరి కృష్ణ, కన్వీనర్ కొత్తకొండ శంకర్, లింగంపల్లి శ్రీకాంత్ , కో కన్వీనర్ ఐతు సృజన్, తునికి పవన్ కుమార్, గౌతమ్, జేరిపోతుల మహేందర్, మురళి మనోహర్ , కొత్త ప్రకాష్ , భూమేష్ పాల్గొన్నారు.