calender_icon.png 17 May, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు

17-05-2025 12:34:23 AM

- ఇప్పటివరకు 20% కూడా దాటని వైనం 

- కొర్రీలు పెడుతున్న మిల్లర్లు 

- కల్లాల్లో ధాన్యం

- అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు 

మేడ్చల్, మే 16(విజయ క్రాంతి): మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకోడిగా సాగుతోంది. ఇప్పటివరకు 20% కూడా కొనుగోలు పూర్తికాలేదు. మిల్ల ర్లు కొర్రీలు పెట్టడంతో కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు కూడా మిల్లర్లకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ధాన్యంలో తాలు , తేమ, మట్టి ఎక్కువగా ఉన్నాయని ధాన్యాన్ని తిరస్కరిస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని కూడా కొ నుగోలు చేయాలని ప్రభుత్వం ఇంతకుముందే ఆదేశాలు జారీ చేసింది. అయిన ప్పటికీ మిల్లర్లు తీసుకోవడం లేదు. తాజాగా శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని మం త్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో 14500 ఎకరాల్లో వరి సాగు కాగా, 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు 875 రైతుల వద్ద కేవలం 4731 మె ట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మేడ్చల్ మండలంలో మేడ్చల్, డబిల్ పూర్, పూడూరు, షామీర్ పేట్ మండలంలో షామీర్పేట్, అలియాబా ద్, మూడు చింతలపల్లి మండలంలో మూ డు చింతలపల్లి, లక్ష్మాపూర్, జగ్గం గూడ, ఉద్దే మర్రి, కేశవరం, ఘట్కేసర్ మండలంలో ఏదిలాబాద్, ప్రతాప సింగారం, మాదారం తో పాటు మండల కేంద్రమైన కీసరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

రైతుల నిరసన 

ధాన్యం కొనుగోలులో తీవ్ర  జాప్యం జ రుగుతుండడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మేడ్చల్ సొసైటీకి రైతు లు తరలివచ్చి ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రం సిబ్బంది ఏదో సాకు చెప్పి కాంటా చేయడం లేదని ఉన్నారు. అక్కడికి వచ్చిన వ్యవసాయాధికారిని అర్చనను రైతులు నిలదీశారు. అన్ని గ్రామాల్లోనూ రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సైతం ధాన్యం కొనుగోలు తీరుపట్ల పెదవి విరుస్తున్నారు. కాగా రైతులు తాలు, తేమ, మట్టి లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హార్వెస్టింగ్ చేసే సమయంలో హార్వెస్టర్ లో ఆర్పిఎం 18 నుంచి 20 మధ్యలో ఉండేలా చూడాలని తెలిపారు. వర్షం కురిసినప్పుడు ధాన్యం తడిచిపోకుండా టార్పాలిన్ ల  కోసం మార్కెటింగ్ శాఖ అధికారులను సంప్రదించాలని తెలిపారు.

గోనె సంచుల కోసం రైతుల అగచాట్లు 

కొనుగోలు కేంద్రాల వద్ద గోనే సంచు ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అధికారులు సంచులను సరిగా సరఫరా చేయ డం లేదు. వీటి కోసం రోజుల తరబడి వేచి చూస్తున్నారు. మేడ్చల్ మండలం డ బ్బిల్ పూర్ సొసైటీ పరిధిలోని కోనాయిపల్లి లో శుక్రవారం రాత్రి గోనే సంచులు రాగా రైతులు ఎగపడి తీసుకున్నారు.

ధాన్యం విక్ర యించడానికి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో దీనిని బట్టి తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు కూడా రావడం లేదు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనందునే రైతులు ధాన్యం విక్రయించడానికి ఇబ్బంది పడుతున్నారని శ్రీరంగవరం మాజీ సర్పంచ్ పోచయ్య విమర్శించారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.