calender_icon.png 10 September, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజమైన హంటింగ్ హౌస్‌లో షూట్ చేశాం

08-09-2025 12:48:22 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి రూపొందిస్తున్నారు. షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “కిష్కింధపురి’ చాలా ప్రత్యేకం. 

ఇప్పటివరకు ఇలాంటి హారర్ సినిమా రాలేదు. కంటెంట్, కాన్సెప్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాం. ట్విస్టులు, షాక్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. నిజమైన హంటింగ్ హౌస్‌లో దీన్ని షూట్ చేశాం. మాకు ‘మిరాయ్’తో పోటీ లేదు. ముందు మేమే రిలీజ్ డేట్ ఇచ్చాం. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని హిట్ చేస్తారు” అన్నారు.

హీరోయిన్ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “నాకు చిన్నప్పట్నుంచి హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా ఒక యూనిక్ హారర్. డైరెక్టర్ కథ చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ‘కిష్కింధపురి’ తెలుగు బెస్ట్ హారర్ సినిమాల్లో  ఒకటిగా నిలుస్తుంది. మీ అంచనాలను అందుకుంటుంది” అని తెలిపింది.