calender_icon.png 10 September, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి భారతీయ దర్శకురాలిగా రికార్డు

08-09-2025 12:50:03 AM

వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 లో ఇండియన్ ఫిల్మ్ మేకర్ అనుపర్ణ రాయ్ రికార్డు సృష్టించారు. ఒరిజోంటి కేటగిరీలో అవార్డు గెలిచిన తొలి భారతీయ దర్శకు రాలిగా ఆమె నిలిచారు. చిత్రం ‘సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్’కి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ఇది ఆమె తొలి సినిమా కావడం విశేషం. ఒరిజోంటి కేటగిరిలో ఎంట్రీ పొందిన ఏకైక భారతీయ చిత్రం ఇది. 1949 నుంచి ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ అవార్డులు ఇస్తున్నప్పటికీ కొత్త ప్రతిభను ప్రోత్స హించేందుకు 20 ఏళ్ల క్రితం ఒరిజోంటి అవార్డు ప్రవేశపెట్టారు.

ఈ ఏడాది ఆగస్టు 27న ప్రారంభమైన ఈ వేడుక సెప్టెంబర్ 6తో ముగిసింది. హాలీవుడ్ ‘ఫాదర్ మదర్ సిస్టర్ మదర్’ ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లయన్ అవార్డును సాధించింది. ఈ సందర్భంగా అపర్ణ రాయ్ మాట్లాడుతూ.. ఇలాంటి కథలను మరింతగా రూపొందించేందుకు ఈ అవార్డు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. పాలస్తీనాలోని దారుణ పరిస్థితులపై ఆమె వ్యాఖ్యానిస్తూ, చిన్నారులకు శాంతి, స్వేచ్ఛ అందించాల్సిన హక్కు ఉందని, పాలస్తీనా చిన్నారులు మినహాయింపు కాకూడదన్నారు.