07-09-2025 12:00:00 AM
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2025 వేడుకలు 13వ ఎడిషన్‌కు ఈసారి దుబాయ్ వేదికయ్యింది. అక్కడి ఎక్స్‌పో సిటీలోని ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఈ వేదికపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు సందడి చేశారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఉత్తమ చిత్రం గా ‘కల్కి 2898 ఏడీ’ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్‌వర్మ, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా అవార్డులు అందుకున్నారు.
‘సైమా 2025 అవార్డులు’ విజేతలు వీరే
ఉత్తమ చిత్రం : కల్కి 2898 ఏడీ
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప2)
ఉత్తమ నటి : రష్మిక మందన్న (పుష్ప2)
ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప2)
ఉత్తమ ప్రతినాయకుడు : కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటుడు : అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి : అన్నే బెన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ హాస్యనటుడు : సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీప్రసాద్ (పుష్ప2)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (దేవర)
ఉత్తమ గీత రచయిత : రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే దేవర)
ఉత్తమ నేపథ్య గాయకుడు : శంకర్‌బాబు కందుకూరి(పీలింగ్స్ పుష్ప2)
ఉత్తమ నేపథ్య గాయని : శిల్పా రావు (చుట్టమల్లే దేవర)
ఉత్తమ పరిచయ నటి : భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)
ఉత్తమ కొత్త నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : తేజ సజ్జా (హనుమాన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) : ప్రశాంత్ వర్మ (హనుమాన్)
ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్)
ఉత్తమ చిత్రం (కన్నడ) : కృష్ణం ప్రణయ సఖి
ఉత్తమ నటుడు (కన్నడ) : కిచ్చా సందీప్
ఉత్తమ నటి (కన్నడ) : ఆషికా రంగనాథ్
ఉత్తమ దర్శకుడు (కన్నడ) : ఉపేంద్ర (యూఐ)