13-09-2025 07:20:27 PM
జుక్కల్,(విజయక్రాంతి): హిందూ ధర్మం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని స్వామి శ్రీ నరేంద్ర చార్య మహారాజ్ అన్నారు. శనివారం జుక్కల్ మండలంలోని దోస్పల్లి గ్రామ పరిధిలో ఉన్న తెలంగాణ ఉప పీఠంలో జగద్గురు రామానందచార్య దక్షిణ భారత పీఠాధిపతి స్వామి శ్రీ నరేంద్ర చార్య మహారాజ్ ను జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే దర్శించుకున్నారు. గత రెండు రోజులుగా ఉప పీఠంలో సమస్య మార్గ దర్శనం ద్వారా స్వామీజీ భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. ఇందులో వెంట మనోజ్ కుమార్ పటేల్, తదితరులు ఉన్నారు.