calender_icon.png 13 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి

13-09-2025 07:17:16 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): జమ్మికుంట పట్టణంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట కి కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు కసుబుసుల  వెంకన్న శనివారం హైదరాబాదులో నీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో  కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని  జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానం నడవడానికి అనువుగా లేనందున వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,

ఈ మైదానంలో జమ్మికుంట పట్టణంలోని 30 వార్డుల నుండి చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ప్రతి రోజు ఉదయం- సాయంత్రం అన్ని వర్గాల ప్రజలు, యువతి, యువకులు, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, పదవి విరమణ పొందినవారు  ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు. ఇదే కాక ఈ మైదానంలో పోలీస్ మరియు మిల్ట్రీ ఉద్యోగ అవకశాల కొరకు ఈ మైదానంలో శిక్షణ పొందుతారు.  ఇప్పుడున్న మానవుని ఆరోగ్యరిత్యా జీవితంలో నడక ఒక భాగం అయినది. 

మైదానం అనువుగా లేకపోవడంతో చాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ మైదానం సుమారుగా 800 మీటర్లు ఉంటుంది. కావున ఈ మైదానంలో నడవడానికి అన్ని వర్గాలు ప్రజలకు అనువుగా ఉండటానికి "సింథటిక్ వాకర్ ట్రాక్" నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ని కోరగా తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.