22 June, 2026 | 1:39 AM

బసవతారకం ఆసుపత్రిని విస్తరిస్తాం

22-06-2026 12:39 AM

నందమూరి బాలకృష్ణ

బంజారాహిల్స్, జూన్ 21 (విజయక్రాం తి): బవసతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ను అనుకున్న విధంగా భవిష్యత్తులో విస్తరిస్తామని సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆదివారం జరిగిన హాస్పిటల్ రజతోత్సవాలకు ఆయన ముఖ్య ఆహ్వానితు లుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు, పరిస్థితు లు మారుతూ వచ్చినా పేదలకు క్యాన్సర్ చికిత్సను చేరువ చేసే సంకల్పంతో హాస్పిటల్ ముందుకు సాగుతోందన్నారు.

సంస్థ అభివృద్ధికి పని చేసిన వైద్యులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.    సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టియస్ రావు మాట్లా డుతూ.. హాస్పిటల్ విస్తరణతో తమందరి బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సతీమణి బసవతారకం కోరుకున్నట్లుగా సంస్థ దినదినాభివృద్ధి చెందడం సంతోషకరమన్నారు.

ట్రస్ట్ బోర్డు సభ్యుడు జెయస్‌ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ.. హాస్పిటల్ ప్రారంభం నుంచి సహాయసహకారాలు అందించిన దాతలను పేరుపేరునా గుర్తు చేసుకున్నారు. అనంతరం సంస్థలో 25 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకున్న బి.రామారావు, టి.రాజేశ్ కుమార్, కె.రోజ, వై.పద్దింట్లమ్మ, ఎన్.ప్రమీలారాణి, కింతల కుమారి, జి.భానుప్రసాద్, జి.శ్రేదేవి, డి.వెంకటేశ్వర్లు, మిట్టా వెంకటేశ్వ ర్లు, ఐ.సింహాచలం, డి.మౌనిక, ఎల్.నిరీక్షా కుమారి, లీలమ్మ ఆ:టోని, యం.జిషైని, ఎన్.సుజాత, పిల్లమ్మ నరేశ్ బాబు, కె.జయ మ్మ, డి.అరుణ, కె.పద్మ, యు.వలసమ్మ, వి.శేషగిరి రావు, చిట్టిమేరీలను ఘనంగా సత్కరించారు.