23-09-2025 12:00:00 AM
ఎర్రుపాలెం సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) :మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తామని, అంతేకానీ అక్రమ పద్ధతిలో దోచుకుంటున్న మట్టి మైనింగ్ మాఫియాను అడ్డుకుంటామని మండలాన్ని ,గ్రామాలను దోచుకుంటున్న వారి భరతం పడతామని అభివృద్ధి నిరోధకల పట్ల తమ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సోమవారం నాడు జమలాపురం దేవస్థానం నుండి ఎర్రుపాలెం తహసిల్దార్ కార్యాలయం వరకు జరిగిన ప్రజా చైతన్య యాత్రలో సిపిఎం పార్టీ నాయకులు పేర్కొన్నారు.
జమలాపురం దేవస్థా నం నుండి జరిగిన యాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ స భ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావులు పాల్గొని తదనంతరం త హసిల్దార్ కు వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. అ క్రమ మట్టి మైనింగ్ మాఫియా మండలంలోని గ్రామాలలో నిత్యం ప్రోక్లైన్లతో మట్టి తరలించకపోతున్నారని పలుమార్లు మండల తహసిల్దార్ కు విన్నవించినప్పటికీ, వినతి పత్రాలు స మర్పించిన స్పందించకపోగా అక్రమార్కులకు సహాయ సహకారాలు అందించడం ఎంతవరకు సమంజసం అని విమర్శించారు.
మట్టి మాఫియాను రెవిన్యూ ,పోలీస్ ,మైనింగ్ శాఖల అధికారులు ఏం చేస్తున్నారని విమర్శించారు. కొన్ని గ్రామాలలో కొద్దిపాటి ప్రభుత్వ అనుమతులతో మట్టి మాఫియా కొండలను గుట్టలను అక్రమంగా తవ్వుతూ కోట్ల సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వారు తాము అభివృద్ధిని అడ్డుకుంటున్నామని చెప్పడం వి డ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టి మాఫియా కు సహకరిస్తున్నారని, అధికారులకు వంత పాడుతున్నారని విమర్శించారు.
పాలకులు ఇకనైనా కళ్ళు తెరిచి మట్టి మైనింగ్ మాఫియాను అరికట్టాలని, తామెప్పుడు అభివృద్ధిని స్వాగతిస్తామని పేర్కొన్నారు. మట్టి మైనింగ్ మాఫియా పై తాము ఉద్యమాలు చేస్తుంటే, మట్టి మైనింగ్ మాఫియాను అడ్డుకోవాల్సింది పోయి మమ్మల్ని విమర్శించడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. అ య్యవారిగూడెం భీమవరం నరసింహపురం జమలాపురం వెంకటాపురం బంజర గ్రామాలలో మట్టి మైనింగ్ మాఫియా యథేచ్ఛగా మట్టిని తోలుకు పోతుంటే కాంగ్రెస్ పెద్దలకు తెలియదా అని విమర్శించారు.
మట్టి మైనింగ్ మాఫియా కు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని, ప్రభుత్వ అధికారుల తీరు మారాలని, ప్రభుత్వ అధికారుల తీరు మారకపోతే రాబోయే రోజుల్లో మట్టి మైనింగ్ మాఫియా ఫై మరిన్ని ఉద్యమాలు చేస్తామని ప్రకృతి సంపదను, మండలాన్ని, గ్రామాలను కాపాడుతామని పేర్కొన్నారు. మట్టి మైనింగ్ మాఫియా మట్టి తోలకలతో ఇతర రా ష్ట్రాలకు ఆదాయం వెళుతుందని, తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు.
అక్రమ మట్టి మైనింగ్ మాఫియాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసు కోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ సిపిఎం కార్యదర్శి ఎం గోపాలరావు, నల్లమోతు హనుమంతరావు, గొల్లపూడి కోటేశ్వరరావు, సగ్గుర్తి సంజీవరావు, రామిశెట్టి సురేష్, డి బసవయ్య, లగడపాటి అప్పారావు, కోటి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.