calender_icon.png 23 September, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయం

23-09-2025 12:00:00 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి

హనంకొండ టౌన్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : హనుమకొండ అంబేద్కర్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా 135 మంది లబ్ధిదారులకు రూ.1,35,15,600 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

128 మంది లబ్ధిదారులకు రూ.43, 28,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. 262 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ దాదాపు రెండు కోట్ల  విలువైన పథకాల లబ్ధి వరంగల్ పశ్చిమ ప్రజలకు చేరుకోవడం, కాంగ్రెస్ ప్రభుత్వమే సాధ్యపడింది. పేదల పెళ్లిళ్ల భారం తగ్గించడానికి కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాలు ఆశీర్వాదం అవుతున్నాయి.

వైద్య అత్యవసర సమయంలో సీఎంఆర్‌ఎఫ్ ప్రాణరక్షకంగా నిలుస్తోంది. సొంత ఇల్లు లేని వారి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లుతో స్వంత గృహం కల నెరవేరుతోంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకే నిదర్శనం అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రజల సమస్యలు కనబడవు. వారు చేసే పని ఒక్కటే అబద్ధపు ప్రచారం. ప్రజల మనసులో అనుమానాలు కలిగించడం.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కష్టతరంగా ఉన్నా, సంక్షేమ పథకాల కోసం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే పని చేసుకుంటున్నాయి. 20 ఏళ్ల పాలనలో వరంగల్ ను వెనుకబాటులోకి నెట్టినవారు నేటి బోధకులు కావడం దురదృష్టకరం అని అన్నారు. నేను చేసే ప్రతి పని ప్రజల కోసం ఎవరి వ్యక్తిగత లాభం కోసం కాదు. ప్రతి పేద కుటుంబం అభివృద్ధి చెందడం,

ప్రతి యువకుడికి అవకాశాలు రావడం, ప్రతి మహిళ గౌరవంగా జీవించడం ఇవే నా లక్ష్యాలు అని అన్నారు. ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఎనుకుంటి నాగరాజు, పలు డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, ఎనుకుంటి పున్నం చందర్, తడుక సుమన్ గౌడ్, బంక సతీష్ యాదవ్, కాంగ్రెస్  నాయకులు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.