calender_icon.png 19 July, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షపు నీటిని ఒడిసి పడతాం

19-07-2025 01:08:49 AM

 జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 

జనగామ, జులై 18 (విజయ క్రాంతి): మన జిల్లా మన నీరు లో భాగంగా  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ లో చేపట్టిన ఇంకుడు గుంతల  నిర్మాణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై డీసీపీ  రాజమహేంద్ర నాయక్ తో కలిసి రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఇంకుడు గుంత నిర్మాణం చేసారు ఈ సందర్బంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.... భూగర్భ జలాల పరిరక్షణ అనేది ఒక సామజిక బాధ్యత అన్నారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు విరివిగా నిర్మించుకోవాలన్నారు గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా..పర్యావరణంలో మార్పులు  వస్తుంటాయాని...ఈ భూగర్భ జల మట్టం ప్రమాద స్థాయికి చేరక ముందే..మేల్కొని భూగార్భ జల మట్టాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. ఇందుకుఇంకుడు గుంతలుఒక మార్గమని.... ఈ కార్యక్రమాన్ని వ్వక్తి గతంగా, సామాజిక పరంగా  భారీ ఎత్తున చేపట్ట గలిగితే  భవిష్యత్ తరాలకు కలుషితం లేని నీరు, స్వచ్ఛమైన నీరును అందించగలుగుతామన్నారు.

మన జిల్లా మన నీరులో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,ఆసుపత్రులు,పాఠశాలలు మొదలగు వాటిలో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టామని... ఇదే విధంగా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండేలా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిర్మాణం చేపట్టాలన్నారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి వన మహోత్సవం లో భాగంగా కలెక్టర్ మొక్కలను నాటారు ఈ కార్యక్రమం లో  రఘునాథ్ పల్లి సి ఐ, ఎస్ ఐ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.