05-12-2025 07:44:13 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా పోస్టర్‌ను జిల్లా కేంద్రం లోని కొట్నాక భీంరావ్ పిల్లలు పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, నాయకురాలు మర్సకోల సరస్వతి, గంధం శ్రీను, నిస్సార్ భాయ్, జీవన్, సినిమా టీమ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.