10-02-2025 12:00:00 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఓ మహిళతో సహజీవనం చేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కూతుళ్లపై లైంగికదాడికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సునీల్ భార్య కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందింది.
2018 నుంచి ఓ మహిళతో సహజీవనం చేస్తూ వస్తున్నాడు. సహజీవనం చేస్తున్న మహిళకు ఇద్దరు కుమార్తెలు(మైనర్లు) ఉన్నారు. వారిపై కన్నేసిన ఉపాధ్యాయుడు తల్లి లేని సమయం చూసి గత రెండేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో వారు భయపడి బయట ఈ నేపథ్యంలోనే సునీల్ హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకున్నట్టు తెలిసి ఆ కూతుళ్లు లైంగిక దాడి గురించి తమ తల్లికి చెప్పినట్టు సమాచారం. కూతుళ్లతో కలిసి బాధితురాలు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వీర రాఘవులు తెలిపారు.