శాశ్వత పరిష్కారం చూపిస్తాం
04-04-2026 12:34 AM
డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్ : వీరన్నపేట లో ని డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులను తొలగించేందుకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపిస్తామని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలోని డంపింగ్ యా ర్డ్ ను ప్రత్యేకంగా ఆయన పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ద్వారా ఈ ప్రాంత వాసులకు దుర్వాసన వెధవలుతుందని ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే చర్యలను తీసుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాక్కీఉద్దీన్, కార్పొరేటర్ మోసిన్, అధికారులు, రహమాన్, జహగీర్ అలీ, ఎండి నిసర్, కాలనీ వాసులు, ప్రజలు పాల్గొన్నారు.




