17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

జొన్నలకు మద్దతు ధర కల్పిస్తాం

19-04-2025 12:59 AM
  1. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

రాయికోడ్లో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

రాయికోడ్(సంగారెడ్డి), ఏప్రిల్ 18(విజయక్రాంతి):జొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర అందించడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు రాయికోడ్  మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా జొన్నలు రబీ పీజన్లో సాగు చేస్తారని జొన్నలకు ప్రభుత్వం మద్దతు ధర అందించడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.3371 కి కొనుగోలు కేంద్రాలలో జొన్నలను కొనుగోలు చేయునట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంత రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వము ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తమ జొన్నలను విక్రయించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంజయ్య,  మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్,  సెట్విన్ చైర్మన్  గిరిధర్  రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నాలాచెరు కచూర్ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ఆర్డీవో రామిరెడ్డి ,  ఎ డి ఎ సత్యనారాయణ, ఎంపీడీవో షరీఫ్, ప్రజా ప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు సిబ్బందిపాల్గొన్నారు.