09-09-2025 12:43:14 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, సెప్టెంబరు 8 (విజయ క్రాంతి): చొప్పదండి నియోజకవర్గం లోని చివరి మడి వరకు సాగునీరు అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది సరైన వర్షాలు కురవకపోవడంతో పంటలకు సాగునీరు అందుతుందో, లేదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, రైతులెవ్వరు ఆందోళనకు గురి కావద్దని పేర్కొన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్ కు గోదావరి జలాలను విడుదల చేసి, అక్కడి నుండి చొప్పదండి నియోజకవర్గం లోని అన్ని చెరువులను నింపి సాగునీరు అందజేయాలని సంబంధిత శాఖ సిఈని కోరినట్లు తెలిపారు. సాగునీటి విడుదలకు సీఈ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, రైతులు ఇబ్బంది పడకుండా నిరంతరం కృషి చేస్తున్నట్లుఆయనతెలిపారు.