30-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, జూలై 29 (విజయ క్రాంతి): అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం గంగాధర మండలం మంగపేట జి.వి.ఆర్ గార్డెన్ లో గంగాధర మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
గత 10 ఏళ్లలో ఇప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని, రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలామంది ప్రజలు పథకాలకు దూరమైనారన్నారు. చొప్పదండి నియోజకవర్గం వరప్రదాయని నారాయణపూర్ రిజర్వాయర్ ను పూ ర్తి చేయడంతో పాటు, కుడికాలువ నిర్మాణాన్ని పూర్తిచేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. చొప్పదండి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలోని 15 మండలాల్లో 78,500 కొత్త కార్డులు, చేర్పులు రేషన్ కార్డులు వచ్చాయన్నారు. జిల్లాలో అత్యధికంగా గంగాధర మండలంలో 5515 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయన్నారు. రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వం సన్న బియ్యం అందజేస్తుండడంతో పేద మధ్య తరగతి ప్రజలకు లాభం చేకూరుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి , సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, ఎమ్మార్వో అనుపమ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మ నోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, బుర్గు గంగన్న, దో ర్నాల శ్రీనివాస్ రెడ్డి, అజయ్ రావు, తోట సంధ్య,రోమాల రమేష్, సత్తు కనుకయ్య,కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపు రెడ్డి గంగాధర సుదర్శన్,రాచమల్ల భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ముచ్చ శంకర్, చందు, వంగల శ్రీనివాస్,మంత్రి మహేందర్, తదితరులుపాల్గొన్నారు.