calender_icon.png 1 August, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక పోరులో టీడీపీ ఉంటుంది

30-07-2025 12:00:00 AM

- కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం 

- తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది 

- విజయ క్రాంతితో టిడిపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం 

మధిర, జులై 28 ,(విజయ్ క్రాంతి) తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ స్థా నం అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నదన్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థా నాలు, ఏఏ పార్టీలతో తెలుగుదేశం పార్టీ పొ త్తు పెట్టుకుంటుందో తదితర అంశాలపై ఆదివారం టిడిపి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు డా క్టర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడారు. 

విజయ క్రాంతి: ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది. 

రామనాథం: ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీగా ఉంది. తెలుగుదేశం పాలన లోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి సాధించింది. అంతేకాకుండా బడుగు బలహీన వ ర్గాలను అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. దీంతో తెలంగాణ ప్ర జలు తెలుగుదేశం పట్ల కృతజ్ఞతతో ఉన్నారు. 

విజయ్ క్రాంతి: స్థానిక సంస్థల్లో టిడిపి పోటీ చేస్తుందా? 

రామనాథం: స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుంది. తె లుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదులో తె లంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.

విజయ్ క్రాంతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఏ పార్టీతో పొత్తు ఉంటుంది.

రామనాథం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ దేశాల మేరకు కూటమితో కలిసి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలని ఆలోచనలో ఉ న్నాం. కానీ బిజెపి పార్టీ ఒంటరిగా పోటీ చే స్తావని ఇప్పటికే ప్రకటించింది. దీంతో కలిసి వచ్చే పార్టీలతో టిడిపి స్థానిక సంస్థల్లో పోటీ చేసి మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తాం.

విజయ్ క్రాంతి: మధిర మున్సిపాలిటీ జనరల్ అయితే మీరు పోటీలో ఉంటారా?

రామనాథం: పార్టీ నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తప్పని సరిగా పోటీలో ఉంటారు. 

విజయ్ క్రాంతి: అధికార కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందా? 

రామనాథం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటమే ప్రధాన లక్ష్యం. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీతో కలిసివచ్చే పార్టీలతో తప్పనిసరిగా పొత్తు పెట్టుకుంటాం.

విజయ్ క్రాంతి: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది.

రామనాథం: కాంగ్రెస్ పాలన కొంత మేరకు పరవాలేదు. రైతులకు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, మహిళకు ఉచిత బస్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, పేదలకు గృహ నిర్మాణం తదితర పథకాలు పేదలకు మేలు చేసే పథకాలు. అయితే ఆ పార్టీ ఇచ్చి న హామీల్లో కొన్ని హామీలను అమలు చేయకపోవడంతో పాటు ముఖ్యంగా పెన్షన్ల పెం పు చేపట్టకపోవడం వలన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఉద్యోగుల జిపిఎఫ్ విడుదల చేయకపోవడం, రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ రాకపోవడం పట్ల ఆయా కుటుంబాల్లో వ్యతిరేకత ఉంది.