31-07-2025 12:00:00 AM
- కలెక్టర్ పమేలా సత్పతి
చొప్పదండి, జూలై 30 (విజయ క్రాంతి): రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఎవరూ ఆందోళన చెందవద్దని అర్హులందరికీ కార్డులు అందిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. బుధవారం చొప్పదండిలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్లో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లిస త్యం తోకలసి కలెక్టర్ నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునేందుకు రేషన్ కార్డు కీలకమన్నారు. జిల్లావ్యాప్తంగా 78 వేలకు పైగా నూతన రేషన్ కార్డులు, చొప్పదండి నియోజకవర్గం నాలుగు వేల కార్డులను అందిస్తున్నామని ఉన్నారు. రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్ నవీన్, వివిధ శాఖల అధికారులు, నాయకులుపాల్గొన్నారు.