calender_icon.png 30 October, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తాం

29-10-2025 12:32:25 AM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య

బోథ్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ నేరడిగొండ మండల కేంద్రం లోని గ్రంథాలయాన్ని మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్స య్య  సందర్శించారు. ఈ సందర్భంగా గ్రం థాలయం లోని రిజిస్టర్లను పరిశీలించారు. రోజు ఎంత మంది వస్తున్నారని, బుక్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అని వాకా బు చేశారు.

ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ నిరుద్యోగులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవడానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని, ఇక్కడే చదువుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు గ్రంథాలయ సిబ్బం ది, నాయకులు శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కె ట్ కమిటీ ఛైర్మన్ బొడ్డు గంగా రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడే వసంత్ రావు, రాజశేఖర్ రెడ్డి, సంజీవ్,  అశోక్, రమేష్, సద్దాం, లైబ్రరీయ న్ శ్రీకాంత్, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.