30-07-2024 01:17:07 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత వినియోగంతో పాటు విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలిసింగ్, సత్వర స్పందన, సాంకేతికత వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేర తీవ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువయ్యేలా, ప్రజలలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పెరిగేలా అధికారులు, సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తున్నా మన్నారు.
నేరాలను అరికట్టడం కోసం, ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంచేందుకు డయల్ 100, 112 ద్వారా వచ్చే ఫిర్యాదులపై అధికారులు, బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ పోలీస్ సిబ్బంది వేగంగా స్పందిస్తున్నారని, బాధితుల వద్దకు వీలైనంన తక్కువ సమయంలో చేరుకునేలా పని చేస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బందిని ప్రతి వీధిలోనూ పెట్రోలింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశామ న్నారు. బ్లూకోల్ట్స్, పెట్రో కార్‌తో పాటు సైకిళ్ల ద్వారా పెట్రోలింగ్ చేయడాన్ని మొద లు పెట్టామని, ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీసు స్టేషన్‌కు 3 సైకిళ్లను పంపిణీ చేశామని, శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రతి రోజు ఉదయం, సాయం త్రం వేళల్లో స్థానిక ఠాణా సిబ్బంది ఆయా ప్రాం తాల్లో సైకిళ్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పెరుగుతున్న మహిళా పోలీసుల భాగస్వామ్యం..
కాగా, ప్రజలకు పోలీసు సేవలను మరిం త చేరువ చేయడంలో భాగంగా మహిళా పోలీసుల పాత్రను పెంచేలా కృషి చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణ లో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యల ద్వారా మహిళా సిబ్బంది ఉత్సాహంగా బ్లూకో ల్ట్స్, పెట్రోల్ కార్ విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. మహిళా సిబ్బంది చేస్తున్న సైకిల్ పెట్రోలింగ్ ద్వారా ప్రజలకు పోలీసులపై భరోసా లభిస్తోంది. ప్రత్యేక షీ టీమ్స్ ద్వారా సమాజం లో స్త్రీలకు ఎదురయ్యే వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నామని, మహిళలు, చిన్నారులు, వృద్ధుల పట్ల నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.