31-07-2025 12:56:44 AM
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర జూలై 30 : దేవరకద్ర మునిసిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దామని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో దేవరకద్ర మండల & మున్సిపాలిటీ చెందిన రేషన్ కార్డ్ లబ్దిదారులకు రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తో కలిసి పంపిణీ జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు.
గత పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని, కమిషన్లు వచ్చే పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులను చేయలేదని పేర్కొన్నారు.ముఖ్యంగా దేవ రకద్ర పట్టణంలో అండర్ పాస్ నిర్మించాల్సిన అవసరం ఉన్న అనాలోచితంగా, కమిషన్ల కక్కుర్తికి దేవరకద్ర పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మించి దేవరకద్ర పట్టణాన్ని రెండుగా చీల్చి దేవరకద్రను అధోగతి పాలు చేశారని గత ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.