12-01-2026 03:38:11 AM
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివా రం ప్రతిష్టాత్మక 32వ జాతీయ స్థాయి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్స్ (ఐఎస్‌ఓఐ2026) కాన్ఫరెన్స్ బ్రోచర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైద్య, దంత వైద్య సదస్సులు నిర్వహించబడటం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. డిజిటల్ యు గానికి అనుగుణంగా రీ జనరేట్, రీ స్టోర్, రీహాబిలిటేట్ అనే నినాదంతో నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్స్, ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, ఆధునిక చికిత్సా విధానాలను దేశ వ్యాప్తంగా దంత వైద్యులకు చేరువ చేస్తుందని పేర్కొన్నారు.
డా.సి.శరత్ బాబు, సీని యర్ డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, ఐఎసెస్‌ఓఐ 2026 ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు, అఫిషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ.. కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ ఇంప్లాంటాలజీ, అడ్వానస్డ్ రీజనరేటివ్ టెక్నిక్స్, ప్రిసిషన్-బేస్డ్ రిస్టోరేటివ్ సొల్యూషన్స్‌పై లోతైన అవగాహన కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖ నిపుణులతో జ్ఞాన మార్పిడి జరగడం వల్ల యువ దంత వైద్యులకు ఇది అరుదైన అవకాశంగా నిలవనుంది అని తెలిపారు.
కార్యక్రమంలో ఐఎస్‌ఓఐ-2026 ఆర్గనైజింగ్ చైర్మన్ డా. విజయ శ్రీనివాస్, సెక్రటరీ డా. పద్మరాయ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓరల్ ఇంప్లాంటా లజీ రంగంలో ఉన్న తాజా పరిజ్ఞానం, క్లినికల్ నైపుణ్యాలు, పరిశోధన ఫలితాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్‌లో ఈ స్థాయి జాతీయ సదస్సు నిర్వహించబడటం దంత వైద్య అకడమిక్ రంగానికి మరింత బలాన్ని ఇస్తుంది అని అన్నారు. 2026 సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న ఈ జాతీయ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖ ఓరల్ ఇంప్లాంటాలజిస్టులు, అకడమిషియన్లు, పరిశోధకులు హాజరుకానున్నారు.