12-01-2026 01:53:30 AM
రాజేంద్రనగర్, జనవరి 11 (విజయక్రాంతి): రాజకీయాల్లో వారసత్వాన్ని తాను ఇష్టపడను అని, సేవా మార్గమే తాను విశ్వసించే అసలైన వారసత్వమని మాజీ ఉపరా ష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్, ముచ్చింతల్ (హైదరాబాద్ చాప్టర్)లో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సర్దార్ పటేల్ ప్రజా మందిరంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో కుటుంబ వారసత్వా న్ని తాను ఇష్టపడనని చెప్పారు. అందుకే త న కొడుకు, కూతరును రాజకీయాల్లోకి తీసుకురాలేదని పేర్కొన్నారు. నాలుగు ‘సీ’లు..
క్యారక్టర్ (గుణం), కెపాసిటీ(సామర్థ్యం), క్యాలిబర్(యోగ్యత), కాండక్ట్(నడత) అనే అర్హతలు ఉన్న ఎవరైనా రాజకీయాల్లో రాణించవచ్చని చెప్పారు. సేవను వారసత్వంగా తీసుకోవడం మంచి విషయమని తాను విశ్వసిస్తానని చెప్పారు. సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలన్న సంకల్పంతో 25 సంవత్సరాల క్రితం తాను ప్రారంభించిన స్వర్ణభారత్ ట్రస్ట్‌ను తన కుమార్తె దీపావెంకట్ విజయవంతంగా నడిపిస్తున్నారని, ఇప్పటివరకు లక్షమందికి నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో ఉచితంగా ట్రస్ట్ ద్వారా శిక్షణ అందించారని, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. తన కుమారుడు ము ప్పవరపు హర్షవర్దన్ ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా సేవామార్గంలో పయనించడం సంతోషంగా ఉందన్నారు.
సంక్రాంతి పండ గ తెలుగు వారి సంస్కృతికి ప్రతీక అని, ఇది ప్రకృతిని గౌరవించే గొప్ప పండగ అని వెం కయ్యనాయుడు చెప్పారు. పెద్దలకు గౌరవాన్ని ఇవ్వాలని, కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రా లు వేరైనా మన మూలం తెలుగేనని, ఏమై నా సమస్యలుంటే కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యలను సా మరస్యంగా పరిష్కరించుకోవాలన్న ఆకాంక్షను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్య క్తం చేయడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇంకా అభివృద్ధి చెందుతుందని, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి గుంటూరు వరకు అంతా కలిసే అమరావతి అని అన్నా రు. సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ స్వరకల్పన చేసి ఆలపించిన వేమన పద్యాల సీడీని వెంకయ్యనాయడు ఆవిష్కరించారు. సంక్రాంతి సంబరాల్లో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు, సినీనటుడు బ్రహ్మానందం, వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ, కుమార్తె దీపావెంకట్, కుమారుడు ముప్పవరపు హర్షవర్దన్, స్వర్ణభారత్ ట్రస్ట్ ఛైర్మన్ కామినేని శ్రీనివాస్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొన్నారు.