calender_icon.png 12 January, 2026 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోసగాడు రేవంత్

12-01-2026 03:00:29 AM

  1. నిజాయతీగా అన్నివర్గాలను మోసం చేస్తున్నాడు 
  2. నిరుద్యోగులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి 
  3. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): నిజాయతీ కలిగిన మోసగాడు రేవంత్‌రెడ్డి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ లోని అన్నివర్గాల ప్రజలను  24 నెలలుగా మోసం చేస్తున్నాడని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్‌గౌడ్ తన అనుచరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సమావేశం లో ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నేత కార్తీక్ రెడ్డి పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరస నలు చేస్తున్నారని, వారు చేస్తున్న ఆందోళన ను గౌరవించి వారిని పిలుచుకొని, ఉద్యోగా లు ఇస్తామని భరోసా ఇవ్వాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని, తూతూ మంత్రం గా కేవలం మీడియా హెడ్‌లైన్ల కోసం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌పైన దృష్టి సారించి దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో బట్టల షాపు ప్రారంభోత్సవానికి పోయిన రేవంత్‌రెడ్డి పక్కనే గతంలో రాహుల్‌గాంధీ నిరుద్యోగులతో సమావేశమైన గాంధీనగర్‌కు ఎందుకు పోలేదని ప్రశ్నించారు. 

సీఎంకు బూతుల భాష మాత్రమే వచ్చు

కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయమని అడిగితే, సీఎం రేవంత్‌రెడ్డి తట్టుకోలే క పోతున్నాడని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు రా వని, ఆయనకు వచ్చిన ఏకైక భాష బూతుల భాష అని ఎద్దేవా చేశారు. హామీలను అమ లు చేయమన్నందుకు ప్రతిపక్షాలను, ప్రజలను, ప్రతి ఒక్కరిని బూతులతో తిడుతున్నా రని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తది అని ప్రజలు అనుకుంటు న్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బులు లేకుండా పరిస్థితులు దిగజారిపోయాయని, వ్యాపారాలు తగ్గిపోయా యి, ఉపాధి దొరకకుండా పోయిందని, దీని కి రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కారణమన్నారు.

పది సంవత్సరాల కింద హైదరాబాదులో ఉ న్న కరెంటు కోతలు, తాగునీటి తిప్పలు, అస్తవ్యస్తపు రోడ్లను హైదరాబాద్ నగర ప్రజలు చూశారని, రాష్ట్రంలో మిషన్ భగీరథతో పా టు హైదరాబాద్, ఇతర పట్టణాల్లో విస్తృతమైన తాగునీటి ప్రాజెక్టులతో తాగునీటి స మస్యలు 90 శాతానికి పైగా పరిష్కరించామ ని గుర్తు చేశారు. పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరి న ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని, నియోజకవర్గాల్లో కాం గ్రెస్ ఎమ్మెల్యేలమని చెప్పుకుంటూ, స్పీకర్ దగ్గర మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏమి అభివృద్ధి చూసి కాంగ్రెస్‌లో చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.