calender_icon.png 12 January, 2026 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచానికి మేడారం వైభవాన్ని చాటుతాం

12-01-2026 02:41:39 AM

తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక సమ్మక్క, సారలమ్మ జాతర 

  1.   251 కోట్లతో శాశ్వత పనులు
  2. ఈ నెల 15 నాటికి పనులన్నీ పూర్తి
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
  4. మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొంగులేటి, సీతక్క, అడ్లూరితో కలిసి మేడారం సందర్శన
  5. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

మేడారం, జనవరి 11 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. , ప్రపంచానికి జాతర వైభవాన్ని చాటి చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రులు శ్రీధర్‌బాబు, కొం డా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి వన దేవతలను దర్శించుకుని, జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూ టీ సీఎం మాట్లాడుతూ.. సమ్మక్క, సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభ వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నా యన్నారు.

ఈసారి జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.251 కోట్లు ఖర్చు చేస్తోందని, ఇందులో జాతర నిర్వహణ కోసం రూ.150 కోట్లు, శాశ్వతంగా గద్దెల ప్రాంగణం నిర్మాణ పనులకు రూ.101 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే జాతర పనులు 85శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర సందర్భంగా అవసరమైన నిధులు విడుదల చేశాం, పూర్తి చేసిన పనులకు 24గంటల్లో బిల్లులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

ప్రధానంగా వైద్యం, విద్యుత్, పంచాయతీ శాఖ అధికారులు జాతర పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని, వీరితో పాటు వివిధ శాఖల సిబ్బంది, అధికారులు జాతర ను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొం దించినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. 

ఆదివారం ఐదు లక్షల మంది దర్శనం 

మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వె య్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపా రు. రానున్న రోజుల్లో వాహనాల రాక మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రోజు దాదాపు ఐదు లక్షల మం ది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు మాట్లాడుతూ.. జాతర సమయంలో ప్రజల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తొక్కిసలాట జరగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాని యా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ రామ్నాథ్ కేక న్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సి.హెచ్ మహేందర్, సంపత్ రావు, ఆర్‌అండ్‌బి ఈఎన్‌సి, మార్కెట్ కమిటీ చైర్మ న్ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్ పాల్గొన్నారు.