14-07-2025 01:12:03 AM
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్,సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, జూలై 13 (విజయక్రాంతి):రైతులకు అన్ని వేళలా ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌ జింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నా రు. ఆదివారం మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి నేలకొండపల్లి మం డలంలోని వ్యవసాయ భూముల వద్ద పర్యటించి పల్లె ప్రజల జీవనశైలిపై పరిశీలన చేశా రు.మంత్రి, మొదటగా పెసర పంట పొలాలను సందర్శించి, రైతులతో ముచ్చటించా రు.
పంటల పెంపకం, సాగు పరిస్థితులు, సాగునీటి సమస్యలపై వారి అభిప్రాయాల ను తెలుసుకున్నారు.వరి నాటుతో కూడిన కూలీలను పొలాల్లోనే కలసి, వారి జీవన స్థితిగతులపై చర్చించారు. మహిళా కూలీలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు, వేతనాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథ కాల గురించి మంత్రి వివరంగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇది కేవలం పంట స్థితిగతుల పరిశీలన మాత్రమే కాదు, పల్లె జీ వన వ్యవస్థపై అవగాహన పెంచుకునే ప్రయత్నమని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, రైతు బం ధు, వేతన హక్కు వంటి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజల నుంచి ప్రత్యక్షంగా అభిప్రాయాలు సేకరించడమే ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఇందిర మ్మ ప్రభుత్వం రైతు భరోసా క్రింద ఎకరానికి 12 వేలు అందిస్తుందని అన్నారు. కేవ లం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతు భరోసా మొత్తాన్ని రైతుల ఖా తాల్లో జమచేశామన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మండల వ్యవసాయ అధికారిణి రాధ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు వున్నారు.
నేడు 3 లక్షల 29 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ
ఖమ్మం, జూలై 13 (విజయ క్రాంతి) : జూలై 14 నుండి నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్ర వ్యా ప్తంగా 3 లక్షల 29 వేల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, నేలకొండపల్లి మండలంలో ఆదివారం పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.
సుర్దేపల్లి నుండి బోదులబండ వరకు 2 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మా ణ పనులకు, కోనాయిగూడెం ఎస్సీ కాలనీ లో 21 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, మంగాపురం తండా నుం డి నాచేపల్లి బాణాపురం రోడ్డు వరకు 4 కో ట్ల 50 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సుర్దేపల్లి గ్రామంలో సుర్దేపల్లి నుంచి బోదులబండ వరకు 2 కోట్ల 50 లక్షలతో నిర్మిం చనున్న 2 కిలోమీటర్ల బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అ న్నారు.
సుర్దేపల్లి నుంచి కృష్ణాపురం వరకు ఉన్న హై లెవెల్ వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి 35 లక్షలు మంజూరు చేసుకున్నామని, గ్రామంలో ప్రతి ఇంటి ముందు సీ సీ రోడ్డు నిర్మాణ పనులు ఇందిరమ్మ ప్రభు త్వం పూర్తి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రా యల నాగేశ్వరరావు, నేలకొండపల్లి మార్కె ట్ కమిటి చైర్మన్ వెన్నపూసల సీతారాము లు, పీఆర్ ఎస్‌ఇ వెంకట్ రెడ్డి, పాలేరు ని యోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, నేలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకటేశ్వ ర్లు, ఎంపిడివో ఎర్రయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.