30-07-2025 11:01:01 PM
మంథని ఏఎంసీ నూతన పాలకవర్గం పదవి బాధ్యతల స్వీకరణలో చైర్మన్ వెంకన్న..
మంథని (విజయక్రాంతి): మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంథనిలో రైతుల కష్టాలను తీరుస్తామని మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న(Market Committee Chairman Kududula Venkanna) అన్నారు. మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు తమ పదవీ బాధ్యతలు బుధవారం అధికారికంగా కార్యాలయంలో స్వీకరించారు. మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుడుదుల వెంకన్న, వైస్ చైర్మన్ గా ముస్కుల ప్రశాంత్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు మంథని సదానందం, కన్నబోయిన ఓదెలు, ఎండి అంకుస్, రేగళ్ల రాం మోహన్ రావు, ఊదరి శంకర్, గదం పోచయ్య, అజ్మీరా చందు నాయక్, పన్నాల ఓదెలు, దూలం సులోచన, లింగంపల్లి నర్సింగ రావు, రవికాంటి వెంకటేష్, ఎల్లంకి శంకర్ లింగం లు తమ బాధ్యతలను చేపట్టారు.
ఈ సందర్భంగా పాలక వర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి మంత్రి శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు లకు, మంత్రి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ కు, పి ఎస్ ఎస్ చైర్మన్ శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పాలక వర్గానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పలువురు శాలువాతో సత్కారించి శుభాకాంక్షలు తెలియజేసి.. మిఠాయిలు తినిపించారు.ఈ సందర్బంగా చైర్మన్ వెంకన్న మాట్లాడుతూ తాము అందరం కలిసికట్టుగా రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూస్తామని, వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదని, రైతు సంక్షేమమే అభివృద్ధికి దారి తీసే మార్గం. రైతులకు మద్దతుగా నిలిచే బాధ్యత మాది అని అన్నారు. మా నూతన పాలకవర్గం రైతుల పక్షాన నిలబడతామని, గిట్టుబాటు ధరలు, మద్దతు ధరల అమలులో పూర్తిగా నిబద్ధత చూపుతామని, గ్రామీణ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా రైతు కార్మిక,సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం మేమందరం పనిచేస్తామని వారి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, సీనియర్ నాయకులు, కుల సంఘ నాయకులు, రైతు సంఘం నాయకులు రైతులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.