calender_icon.png 31 July, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీసీలను సద్వినియోగం చేసుకోవాలి

30-07-2025 11:04:29 PM

ఎంపీడీవో రాజేశ్వర్..

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్(MPDO Rajeshwar) కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఏటీసీ గోడ ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటిఐల స్థానంలో అత్యాధునిక సాంకేతిక శిక్షణ సంస్థలను(ఎటిసి) టాటా టెక్నాలజీస్ సహకారంతో ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఏటీసీల ద్వారా యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించి నైపుణ్యం గల శిక్షకులుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏటీసీలలో చేరి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని స్వయం ఉపాధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ దేవానంద్, ఎంపీడీవో కార్యాలయం అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.