13-10-2025 02:46:13 PM
బాన్సువాడ, నిజామాబాద్ పెండింగ్ రహదారి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే రహదారిపై కొన్నినెలలుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో రహదారిపై రాస్తారోకో చేశారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఆర్నెళ్ల క్రితం రహదారి మరమ్మతులు ప్రారంభించి నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు.
దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు.కాంట్రాక్టర్ కారణంగా ఇప్పటికే అనేకమంది రహదారిపై గాయాలపడ్డారని వారు వాపోయారు. రాబోయే వారం రోజుల్లో రోడ్డు పనులు పూర్తిచేయకుంటే పెద్దఎత్తున నిరసనకు దిగుతామని హెచ్చరించారు.