calender_icon.png 13 October, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరితహారం చెట్లు నరికివేత

13-10-2025 02:49:28 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల ఎలమంచిలి తండా గ్రామ పంచాయతీలో హరితహారం చెట్ల నరికివేత గత టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం అధికారుల అవగాహన లోపంతో నీరు గారిపోతుంది. హరితహారం పథకం కోసం అధికారుల నిర్లక్ష్యంతో నాటిన మొక్కలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. మరిపెడ మండలం ఎలమంచిలి తండా గ్రామపంచాయతీలో హరితహారం లో భాగంగా నాటిన మొక్కలు ఎలా పెరుగుతాయి అనే ఆలోచన లేకుండా ఆ పూటకు మొక్కలు నాటి లెక్కలు రాసుకున్నారు. కానీ ప్రభుత్వం లక్ష్యం మొక్కలు పెంచాలి అనే అధికారులు గుర్తించడం లేదు అధికారుల లక్ష్యం ఒకటే మొక్కలు నాటాలి లెక్కలు రాయాలి.

ఆ మొక్కలు పెరిగి పెద్దయ్యాక ఎలా ఉంటాయో గుర్తించడం లేదు అధికారుల నిర్లక్ష్యంతో హరితహారం లో నాటిన మొక్కలు పెరిగి గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగరడడంతో పాటు ప్రజాధనం వృధా అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా అధికారులు మొక్కలు నాటే సమయంలో తగు జాగ్రత్త లు తీసుకొని మొక్కలు నాటితే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందనీ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరికిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.