13-10-2025 01:04:38 AM
-మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆమోదం
-ఇక ప్రతి నెలా సకాలంలో వేతనాలు
-సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : గురుకుల విద్యాసంస్థల్లో పనిచే స్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల సేవలను తెలంగాణ ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృత జ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్ పద్ధతిలో 2, ఔవుట్‌సోర్సింగ్ పద్ధతిలో 1,545, పార్ట్‌టైమ్ విధానంలో 2,102, హానరేరియం పద్ధతిలో 443 మొత్తం 4,092 మంది ఉద్యోగుల సేవలు పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలో పనిచేస్తున్న 4,092 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ జీవో జారీ చేసి, మానవతా దృక్పథాన్ని ప్రజాప్రభుత్వం చూపిందన్నారు.
ఈ నిర్ణయంతో వేతనాల చెల్లింపులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది కుటుంబాలకు భారీ ఊరట కలగనుందని మంత్రి పేర్కొన్నారు. ఇకపై ప్రతి నెలా వేతనాలు సకాలంలో చెల్లింపునకు మార్గం సుగమమవుతుందని స్పష్టం చేశా రు. ప్రభుత్వం విద్యా వ్యవస్థ, గురుకుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉజ్వల భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
“ఇది కేవలం పరిపాలనా నిర్ణయం కాదు. ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపే ప్రజా సంకల్పం” అని అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వ్యా ఖ్యానించారు. ఈ సందర్భంగా ఎస్సీ గురుకుల ఉద్యోగులందరూ విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.