13-10-2025 03:05:33 PM
నకిరేకల్,(విజయక్రాంతి): అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు అధైర్య పడద్దని, ధాన్యం కొనుగోలును వేగవంతం చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి, మంగళపల్లి కడపర్తి, చందంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అకాల వర్షాలు సంభవిస్తుండడంతో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
రైతులకు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.ప్రభుత్వం తరపున అని శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు పై నిరంతరం సమీక్ష చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దళారి చేతిలోకి పోయి రైతులు మోసపోవద్దని ఆయన సూచించారు