13-10-2025 02:46:09 PM
పాట్నా: తాను బతికి ఉన్నంత కాలం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్(RJD leader Tejashwi Yadav) సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. "నిజమైన బిహారీ" అని, బయటి వ్యక్తులకు తాను భయపడనని తేల్చిచెప్పారు. ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసులో తనపై, తన తండ్రి లాలూ ప్రసాద్, తల్లి రబ్రీ దేవిపై ఢిల్లీలోని కోర్టు అభియోగాలు మోపిన తర్వాత, తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. తాము పోరాట మార్గాన్ని ఎంచుకున్నామని, ఆ మార్గంలో నడవడం ద్వారా వారు ఖచ్చితంగా తమ గమ్యాన్ని చేరుకుంటారని అన్నారు.
"ఒక నెల క్రితం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) జీ బీహార్ కు వచ్చినప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసే స్థితిలో మమ్మల్ని వదిలిపెట్టనని బెదిరించారు. నేను పోరాడతాను, గెలుస్తాను. మేము బీహారీలు, నిజమైన బీహారీలు... మేము బయటివారికి భయపడము. జై బీహార్, జై బీహారీ," అని తేజస్వి ఎక్స్ లో ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ఐఆర్‌సిటిసి కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, వారి కుమారుడు, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌లపై సోమవారం కోర్టు అభియోగాలు నమోదు చేసింది.