calender_icon.png 13 October, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాచిబౌలి నాలా పూడిక తొలగింపు .. బస్తీవాసుల కృతజ్ఞతలు

13-10-2025 02:43:06 PM

సనత్‌నగర్(విజయక్రాంతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) ఎల్లప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో రాంగోపాల్ పేట డివిజన్ లోని కాచి బౌలి, నల్లగుట్ట, చుట్టాల బస్తీ ప్రాంతాలు ముంపుకు గురికాగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయా ప్రాంతాలలో అధికారులతో కలిసి పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కాచిబౌలి నాలాలో పూడిక తొలగించకపోవడం వల్లనే ముంపు సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే కు విన్నవించారు. నాలా ను పరిశీలించిన ఎమ్మెల్యే నాళాలో పూర్తిస్థాయిలో పూడిక తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు గత కొద్దిరోజులుగా కాచి బౌలి నాలాలో పూడిక తొలగించారు. ఎన్నో రోజుల తమ సమస్య పరిష్కారం కావడంతో సోమవారం బస్తీవాసులు వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో  ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.