26-07-2025 12:04:56 AM
రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం రావు
శామీర్ పేట్, జులై 25: మున్నూరు కాపులకు అండగా నిలబడతా రాష్ట్ర అధ్యక్షుడు పుట్ట పురుషోత్తం రావు అన్నారు. శుక్రవారం చలో వేములవాడ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నుండి ప్రారంభమైన ర్యాలీ షామీర్పేట్ చేరుకుంది . వీరికి షామీర్పేట్ అధ్యక్షుడు చాట్లపల్లి నర్సింహారావు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం రావు శామీర్పేట్ కట్ట మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో ము న్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కొరకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్నూరు కాపు కులస్తులకు ఎలాంటి అవసరాలు ఉన్నా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మున్నూరు కా పు కులస్తులకు ప్రత్యేక గుర్తింపు కొరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్య క్రమంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ము న్నూరు కాపు సంఘం నాయకులు పెద్ద ఎత్తునపాల్గొన్నారు.