calender_icon.png 27 July, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర

26-07-2025 12:06:54 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 

హైదరాబాద్, జులై 25 (విజయక్రాంతి):  బీసీ రిజర్వేషన్ల అర్డినెన్స్‌ను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులకు లేదన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేశారని, ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీలను నియమించకపోవడంతోనే ..

బీసీల విషయంలో బీజేపీ వైఖరి స్పష్టమైందన్నారు. బూతులను ప్రవేశపెట్టింది కేసీఆర్ అయితే.. వాటిని కేటీఆర్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. బూత్ మాటలకు బీఆర్‌ఎస్ నేతలు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని ఆయన మండిపడ్డారు. తమ భార్యల ఫోన్లను ట్యాపింగ్ చేసుకున్న చరిత్ర బీఆర్‌ఎస్ వాళ్లదని విమర్శించారు. కేటీఆర్ తొలుత వాళ్ల కుటుంబ పంచాయితీని చక్కదిద్దుకోవాలని, ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడాలన్నారు. ఎమ్మెల్సీ కవిత కులగణన లెక్కలు బయటపెట్టాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.