జుకర్‌బర్గ్ క్షమాపణలు
ప్రధాని మోదీ ఫేస్‌బుక్ పోస్టు తొలగింపు, పొరపాట్లపై విచారం
చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, డీప్‌ఫేక్‌ల వీడియోలు ప్లాట్‌ఫారమ్స్ నిర్వహణలో లోపమేనని అంగీకారం
న్యూఢిల్లీ, ఆగస్టు 5: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పోస్టును తాత్కాలికంగా తొలగించినందుకు ఇన్‌స్టా గ్రామ్, వాట్సాప్‌ల యజమాని అయిన మెటా ప్లాట్‌ఫామ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్, డీప్‌ఫేక్ సంబంధించిన వైఫల్యాలను కంపెనీ అధికారులు అంగీకరించారు.
కొన్ని రకాల కంటెంట్‌ను ప్రచారం చేయడానికి భారీగా డబ్బు చెల్లించినట్లు అంగీకరించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనా లు ప్రసారం అవుతున్నాయి. నిర్దిష్టమైన యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రచారా లు జరిగాయని వెల్లడించింది. ఈ పొరపాటు పట్ల తాము చింతిస్తున్నామని మెటా ప్రతినిధులు స్పష్టం చేశారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజం మెటా గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని గ్లోబల్ టీమ్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమైన అనంతరం ప్రభుత్వవర్గాలు మాట్లాడాయి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యజమాని మెటా, తమ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణలో లోపాలు ఉన్నాయని అంగీకరించిందని తెలిపాయి. గత నెలలో మోదీ ఫేస్‌బుక్ పోస్టును కొద్దిసే పు తొలగించడంపై ప్రభుత్వం ఆ కంపెనీ ప్ర పంచ నాయకత్వాన్ని పిలిపించిన నేపథ్యంలో ఈ సమావేశాలు జరిగాయి.
ఆ తొలగింపునకు సాంకేతిక లోపమే కారణమని మెటా ఆరోపించింది. ఈ సమావేశంపై మెటా అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ, ఈ ఘటనపైనా, ఇతర కంటెంట్ మోడరేషన్ వైఫల్యాలపైనా మెటా బృందం క్షమాపణలు చెప్పి, విచారం వ్యక్తం చేసిందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ‘ఒక నిర్దిష్ట రకమైన కంటెంట్‌ను ప్రోత్సహించడానికి చాలా డబ్బు చెల్లించబడింది’ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా అంగీకరించారని చెప్పాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో ఫేస్‌బుక్ నుంచి తొలగించడమే ఈ వివాదానికి ప్రధాన కారణం.
నీట్ పరీక్షల వివాదంపై యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను ఫేస్‌బుక్ తొలగించింది. సుమారు ఐదు గంటల పాటు ఈ వీడియో అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఘటనపై పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిం ది. మూడు రోజుల్లోగా మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని పార్లమెం టరీ కమిటీ హెచ్చరించింది. లేనిపక్షంలో ఐటీ చట్టం కింద లభించే చట్టపరమైన రక్షణ ను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది. సేఫ్ హార్బర్ రక్షణ కోల్పోతే మెటా సంస్థపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవ కాశం ఉంది. ప్రధాని వీడియో తొలగింపు చర్య దేశంలో అస్థిరత సృష్టించే కుట్రలో భాగమేనని కమిటీ అభిప్రాయపడింది.






