03-08-2025 12:31:40 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం ఆపి తీరుతుందని, సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేశారని కా ంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నా రు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని, బనకచర్ల డీపీఆర్‌ను కూడా రిజెక్ట్ చేశారని తెలిపారు. శనివారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బనకచర్లపై హరీశ్‌రావు తెగ హ డావుడి చేస్తున్నారని, ఆయనకు అంత కష్టం అవసరం లేదన్నారు. నారా లోకేశ్ మాట్లాడినంత మాత్రాన హడావుడి పడాల్సిన అ వసరం లేదని, అనుమతులు లేకుండా నా రా లోకేశ్ బనకచర్లను ఎలా కడతారో చూ స్తామన్నారు. గతంలో లోకేశ్‌ను రహస్యంగా కేటీఆర్ కలిశారని, లోలోపల మంతనాలు.. పైకి మాత్రం విమర్శలా అని ప్రశ్నించారు.
బావమరిది కౌగిలిచ్చుకుంటారు, బావ మా త్రం తెలంగాణ భవన్‌లో ఉత్తుత్తి ప్రకటనలు చేస్తారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ మోసగాళ్లకు అడ్డాగా మారిందన్నారు. మీరు తె లంగాణ ప్రయోజనాలను కాపాడలేరనే ప్ర జలు మిమ్నల్ని ఫాంహౌస్‌కు పంపారని వి మర్శించారు. మీరు రాయలసీమను రతనా ల సీమను చేసేందుకు పనిచేస్తే.. మేం తెలంగాణ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటాను సాధించేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు.