03-08-2025 12:31:53 AM
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు నేటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో బలమైన ఉపరితల గాలులు గంటకు 30 కి.మీ వేగంతో వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుము లు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.