calender_icon.png 3 August, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడి పని చేసిన వారిని నాయకులుగా తీర్చిదిద్దుతాం

03-08-2025 12:31:03 AM

ఖమ్మం,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడి పని చేసిన వారిని కొత్తతర నాయకులుగా తీర్చిదిద్దుతాం అని ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం కూడా అదే అని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ నిర్వాహకులు గంటా వినయ్ నాయుడు అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలం సంజీవ్ రెడ్డి భవన్ నందు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిలుగా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ నిర్వాహకులు గంటా వినయ్ నాయుడు, రాష్ట్ర సమన్వయకర్త మహ్మద్ జావేద్ హాజరైనారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయి, పార్లమెంటు నియోజకవర్గలస్థాయి నుంచి ప్రతి ఒక్కరిని గుర్తించడంలో ఈ కార్యక్రమం ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మీరందరూ నిరంతరం కృషి చేయాలని దిశా నిర్దేశం చేసారు.